Bomb Threat | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) మహానగరానికి బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు ముంబై ట్రాఫిక్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ బెదిరింపు మెసేజ్ వచ్చింది. ముంబైతోపాటు జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్ (Dhanbad)కు కూడా బెదిరింపులు వచ్చాయి. బెదిరింపు మెసేజ్‌తో అప్రమత్తమైన ముంబై పోలీసులు మొబైల్ నంబర్ ఆధారంగా మెసేజ్ పంపిన వ్యక్తిని ట్రేస్ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Melania Trump | ట్రంప్ విజయంలో బారన్ మాస్టర్ స్ట్రాటజీ ఫలించింది : మెలానియా ట్రంప్
Earthquake | హిమాచల్‌ను వణికించిన వరుస భూకంపాలు.. స్వల్ప వ్యవధిలోనే మూడు సార్లు కంపించిన భూమి
Samajwadi Party | ఎంవీఏకు షాక్.. కూటమి నుంచి వైదొలగిన సమాజ్‌వాదీ పార్టీ