Melania Trump | ఇటీవలే జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న యూఎస్ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే, ట్రంప్ గెలుపులో తన కుమారుడు బారన్ ట్రంప్ (Barron Trump) కీలక పాత్ర పోషించినట్లు కాబోయే ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (Melania Trump) తాజాగా తెలిపారు. ఈ మేరకు ఓ వార్తా ఛానెల్‌కు మెలానియా ఇంటర్వ్యూ ఇచ్చారు.
అధ్యక్ష ఎన్నికల్లో బారన్ మాస్టర్ స్ట్రాటజీ ఫలించినట్లు చెప్పారు. ఎన్నికల్లో యువతను ఆకర్షించేందుకు బారన్ ఎంతగానో తోడ్పడినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుత కాలంలో యవత టీవీ వంటి సంప్రదాయ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు దూరంగా ఉంటున్నారన్నారు. ఫోన్లు, పాడ్కాస్ట్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని మెలానియా తెలిపారు. ఈ మార్పును బారన్ బాగా అర్థం చేసుకున్నాడని వివరించారు. ఈ ఎన్నికల్లో బారన్ సలహాలు, వ్యూహాలు ఫలించాయని సంతోషం వ్యక్తం చేశారు.
Also Read..
Elon Musk | ట్రంప్ ప్రచారం కోసం.. ఎలాన్ మస్క్ ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశారో తెలుసా?
నాసా చీఫ్‌గా మస్క్ సన్నిహితుడు
Donald Trump | అప్పటిలోపు వారిని విడుదల చేయకపోతే.. హమాస్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్