వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) చీఫ్గా ఎలాన్ మస్క్ వ్యాపార సన్నిహితుడు, ప్రైవేట్ వ్యోమగామి జేర్డ్ ఐజాక్మన్ను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ఎక్స్ నిర్వహణ బాధ్యతలను ప్రస్తుతం ఐజాక్మన్ నిర్వహిస్తున్నారు. ఐజాక్మన్ రెండుసార్లు అంతరిక్ష ప్రయాణం చేశారు.