Donald Trump | అప్పటిలోపు వారిని విడుదల చేయకపోతే.. హమాస్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్
Donald Trump | ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హమాస్‌కు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Donald Trump | ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హమాస్‌కు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందే హమాస్ ఉగ్రవాద సంస్థ (Hamas-led militants) చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టాలని (Gaza hostage release) అల్టిమేటం జారీ చేశారు.
లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. ఈలోపు బందీలను విడుదల చేయాలని తేల్చి చెప్పారు. లేదంటూ నరకం చూస్తారని, గతంలో ఎన్నడూ చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు.
కాగా, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో వెయ్యిమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం దాదాపు 200 మందికిపైగా ప్రజలను హమాస్ బంధించి గాజాలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం సందర్భంగా కొందరిని విడుదల చేసింది. బంధీల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 51 మంది సజీవంగా ఉన్నారు.
బందీలకు సంబంధించిన వీడియో హమాస్ మిలిటరీ విభాగం ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో అమెరికా – ఇజ్రాయెల్ జాతీయుడైన 20 ఏళ్ల ఎడాన్ అలెగ్జాండర్ మాట్లాడుతూ.. మమ్మల్ని హమాస్ చెర నుంచి త్వరగా విడిపించండి అంటూ వేడుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ వీడియోపై ట్రంప్ పై విధంగా స్పందించారు.
Also Read..
Donald Trump | పశ్చిమాసియా వ్యవహారాల సలహాదారుగా.. వియ్యంకుడికి ట్రంప్ కీలక పదవి
Weapons | 53 లక్షల కోట్ల ఆయుధాల అమ్మకం.. వ్యాపారుల పంట పండించిన ఉక్రెయిన్, గాజా యుద్ధాలు!
Moon | భూమి కంటే చందమామపై వేగంగా గడుస్తున్న సమయం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

