
పోలీసులు దొంగచాటుగా లంచాలు తీసుకోవడం చూస్తూ ఉంటాం. కానీ బహిరంగంగానే ఆ తప్పుడు పనిని సమర్థించుకున్నాడో పోలీసు అధికారి. అది కూడా ఒక పాఠశాల కార్యక్రమంలో విద్యార్థులందరి ముందు వేదిక మీద అతను ఈ మాటలు అన్నాడు. అతను మాట్లాడిన ప్రసంగాన్ని ఒక జర్నలిస్ట్ రికార్డ్ చేసి ఆ వీడియోని ట్విట్టర్లో పెట్టాడు. ఆ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో జరిగింది.
ఉన్నావ్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో పోలీస్ కీ పాఠశాల అనే కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశిస్తూ ఆ జిల్లా పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ” పోలీస్ డిపార్ట్మెంట్ చాలా నీతి వంతమైనదని.. ఇతర డిపార్ట్మెంట్లు డబ్బు తీసుకున్నా పని చేయవు.. కానీ మేము మాత్రం డబ్బు తీసుకుంటే తప్పకుండా పని జరుగుతుంది. కావాలంటే చూడండి మీ ఉపాధ్యాయులు కరోనా కారణంగా ఇంట్లో కూర్చొని పనిచేస్తుంటే.. పోలీసులు బయటికొచ్చి భయపడకుండా పనిచేస్తున్నారు” అని అన్నాడు.
Video from "Police ki pathshala" in UP's Unnao
— Piyush Rai (@Benarasiyaa) December 20, 2021
Police department is still the most honest department. If police takes money, it gets the job done. Other department keep dilly-dallying.
Video credit: @sanjayjournopic.twitter.com/mUHovttVsx
ఈ వీడియో బాగా వైరల్ కావడంతో ఆ జిల్లా కలెక్టర్ ఈ సంఘటనపై దర్యాప్తు జరిపిస్తున్నారు.