NDA meeting : కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి 12 ఏళ్లు అధికారం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బుధ, గురు వారాల్లో ఎన్డీయే పక్షాల కీలక భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. 12 ఏళ్లు పూర్తైన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడంతోపాటు, భవిష్యత్లో ఎలా కలిసి ముందుకు వెళ్లాలి అనే అంశాలపై ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే ఎన్డీయేకు చెందిన నేతలు సమావేశం కోసం ఢిల్లీ చేరుకున్నారు.
ఃమంగళవారం కూడా సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇక గురువారం ప్రధాని మోదీ.. ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో కూడా భేటీ కానున్నారు. తమ పాలన ఉన్న రాష్ట్రాల్లో వికసిత్ భారత్ కోసం ఎలా పని చేయాలి, పశ్చిమాసియా సంక్షభాన్ని ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాలపై మోదీ వారితో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలో చమురు ధరలు పెరగడం వల్ల ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే, ద్రవ్యోల్బణం కూడా సమస్యగా మారుతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని చర్చిస్తారు. మరోవైపు రాజకీయంగానూ ఈ భేటీ ఎన్డీయేకు చాలా కీలకం.
ఇండియా కూటమి పక్షాల భేటీ సోమవారం ఢిల్లీలో జరిగిన సంగతి తెలిసిందే. డీఎంకే, ఆప్, కమ్యూనిస్ట్ పార్టీలు మినహా ఎక్కువ పార్టీలు ఈ భేటీకి హాజరయ్యాయి. దీంతో ఇండియా కూటమి భవిష్యత్లో బలంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీయే భేటీ చాలా కీలకంగా మారనుంది. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీలో జరిగే సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరవుతారు. ప్రధానితో భేటీ అనంతరం వీరు నీతి అయోగ్ సమావేశంలో కూడా పాల్గొంటారు.