Priyanka Gandhi : చట్టసభల్లో డ్రామాలు ఆడవద్దని, టిప్స్ ఇస్తానని ప్రధాని (Prime minister) నరేంద్ర మోదీ (Narendra Modi) విసిరిన వ్యంగ్యాస్త్రాలపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) స్పందించారు. సమావేశాల్లో భాగంగా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఢిల్లీ కాలుష్యం వంటి తీవ్రమైన అంశాలను లేవనెత్తడం డ్రామా ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు.
ఎన్నికల నిర్వహణలో అవకతవకలు, ఎస్ఐఆర్, కాలుష్యం వంటివి తీవ్రమైన అంశాలని, వాటిని చర్చిద్దామని ప్రియాంకాగాంధీ అన్నారు. సీరియస్ అంశాలపై చర్చ లేకపోతే పార్లమెంట్ దేనికి..? అని ఆమె ప్రశ్నించారు. ఆయా అంశాలపై మాట్లాడటమేమీ డ్రామా కాదని, ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య చర్చలకు అనుమతించకపోవడమే డ్రామా అని వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే ప్రధాని మోదీ పార్లమెంట్ వేదికగా ప్రజాసమస్యలపై చర్చించడానికి బదులు మరోసారి నాటకీయ ప్రసంగం చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్ రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటుందని చెప్పారు. సోమవారం శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు.