Pm Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Pm Modi) కెనడా (Canada) చేరుకున్నారు. ఇవాళ ఉదయం కెనడాలోని కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడ మోదీకి ఘన స్వాగతం లభించింది. 2015 తర్వాత మోదీ కెనడాలో పర్యటించడం ఇదే తొలిసారి. జీ7 సదస్సు కోసం ప్రధాని కెనడా వెళ్లారు.
జూన్ 15 నుంచి 17 వరకు కెనడాలో జీ7 దేశాల సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీకి కెనడా నుంచి గతవారం ఆహ్వానం అందింది. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney).. మోదీకి ఫోన్ చేసి సదస్సుకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు ప్రధాని కెనడా వెళ్లారు. జీ7 సదస్సులో పాల్గొననున్నారు. భారత్-కెనడా మధ్య నెలకొన్న విభేదాల కారణంగా జీ 7 సమ్మిట్‌కు ప్రధాని మోదీ దూరంగా ఉంటారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, ఈ సదస్సులో పాల్గొనాలని ప్రధాని నిర్ణయించుకున్నట్లు ఇటీవలే ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
#WATCH | Canada: PM Narendra Modi receives a warm welcome as he lands in Calgary. He will attend the 51st G7 Summit in Kananaskis, Alberta. #PMModiAtG7
Source: DD https://t.co/lK5LNoG8Qy pic.twitter.com/4dga9ufQG7
— ANI (@ANI) June 17, 2025
ఈ సదస్సులో ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంపై ప్రధాని చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చర్చల ద్వారా ప్రస్తుత వివాదానికి పరిష్కారం చూపాలని మోదీ కోరనున్నట్లు సమాచారం. అంతేకాదు ఇటీవలే పాక్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి కూడా ప్రపంచ నాయకులతో ప్రధాని చర్చించనున్నట్లు తెలిసింది.
జీ7 అంటే ?
అత్యంత అధునాతన, పారిశ్రామికీకరణ చెందిన ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఏడు దేశాల కూటమి. అమెరికా కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, జపాన్ సభ్యదేశాలు. జీ7 అనే పేరు సభ్య దేశాల సంఖ్యని సూచిస్తుంది. ఇందులో భారత్ సభ్యదేశం కాకపోయినా.. ఏటా ఈ సదస్సుకు భారత్‌కు ఆహ్వానం అందుతోంది.
Also Read..
Air India | మరో ఎయిర్ఇండియా విమానంలో సాంకేతిక సమస్య..
‘ఉపాధి హామీకి కేంద్రం పాతర..నిధుల ఖర్చుపై మోదీ సర్కారు పరిమితులు