నికోసియా, జూన్ 16: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదన్న సంగతి సైప్రస్ అధ్యక్షుడు, తాను అంగీకరిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం పశ్చిమాసియా, యూరప్‌లో నెలకొన్న యుద్ధ సంక్షోభాలపై సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్, ప్రధాని మోదీ ఇరువురూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ రెండు రోజుల సైప్రస్ పర్యటనలో భాగంగా సోమవారం అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్‌తో ముఖాముఖి చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలి. స్థిరత్వాన్ని పునరుద్ధరించటం మానవత్వపు పిలుపు’గా ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీకి సైప్రస్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేసింది.