PM Modi | బిహార్‌లో కొలువుతీరిన ఎన్డీయే సర్కార్ : ప్రధాని మోదీ అభినందనలు
PM Modi : బిహార్ సీఎంగా నితీష్ కుమార్ రికార్డుస్ధాయిలో తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
PM Modi : బిహార్ సీఎంగా నితీష్ కుమార్ రికార్డుస్ధాయిలో తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ మద్దతుతో మళ్లీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన నితీష్ కుమార్‌తో పాటు, నూతన బిహార్ టీంను మోదీ అభినందించారు. బీజేపీకి చెందిన సమ్రాట్ చౌధురి, విజయ్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
బిహార్‌లో నూతనంగా కొలువుతీరిన ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడుచుకోకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని మోదీ ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేసిన సమ్రాట్ చౌధురి, విజయ్ సిన్హాలకు అభినందనలని పేర్కొన్నారు. ఈ టీం రాష్ట్రంలోని నా కుటుంబసభ్యులకు అంకితభావంతో సేవలందిస్తుందనే విశ్వాసం తనకు ఉందని ప్రధాని హిందీలో ట్వీట్ చేశారు. ఇక బిహార్‌లో కొద్దిరోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు తెరపడింది.
ఉత్కంఠ నడుమ జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ఏర్పాటు చేసిన మహాఘట్ బంధన్‌కు గుడ్‌బై చెప్పిన నితీశ్‌కుమార్.. మళ్లీ బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పట్నాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. నితీశ్‌తో పాటు మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకరం చేశారు.
Read More :
Owaisi | బీహార్ ప్రజలకు నితీశ్ క్షమాపణ చెప్పాలి.. అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Message
- Nitish Kumar
- Pm Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

