న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మరో కొత్త ప్రథకాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన (Pradhanmantri Suryodaya Yojana) ద్వారా కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత ఢిల్లీకి చేరిన ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకంపై జరిగిన సమీక్షా సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ‘ప్రపంచంలోని భక్తులంతా ఎల్లప్పుడూ సూర్యవంశీయుడైన శ్రీరాముడి నుంచి కాంతిని, శక్తిని పొందుతారు. ఈ రోజు అయోధ్యలో పవిత్ర ప్రతిష్ఠాపన శుభ సందర్భంగా, భారతదేశంలోని ప్రజల ఇళ్లపై సొంత సౌర వ్యవస్థ కలిగి ఉండాలన్న తీర్మానం మరింత బలపడింది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
కాగా, అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాను తీసుకున్న మొదటి నిర్ణయమని ప్రధాని మోదీ తెలిపారు. ‘కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసే లక్ష్యంతో ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ను మా ప్రభుత్వం ప్రారంభించనున్నది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ చర్య ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు కరెంటు బిల్లులు తగ్గడమే కాకుండా ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా మారుస్తుందని వెల్లడించారు.
सूर्यवंशी भगवान श्री राम के आलोक से विश्व के सभी भक्तगण सदैव ऊर्जा प्राप्त करते हैं।
आज अयोध्या में प्राण-प्रतिष्ठा के शुभ अवसर पर मेरा ये संकल्प और प्रशस्त हुआ कि भारतवासियों के घर की छत पर उनका अपना सोलर रूफ टॉप सिस्टम हो।
अयोध्या से लौटने के बाद मैंने पहला निर्णय लिया है कि… pic.twitter.com/GAzFYP1bjV
— Narendra Modi (@narendramodi) January 22, 2024