PM Modi : కేంద్ర ప్రభుత్వం (Union Govt) ఇవాళ లోక్‌సభ (Lok Sabha) లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టింది. నియోజకవర్గాల పునర్విభజనకు లింకు పెడుతూ మహిళా రిజర్వేషన్‌పై సవరణ బిల్లును కూడా సభ ముందుకు తెచ్చింది. అయితే కేంద్రం చర్యపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మహిళా రిజర్వేషన్‌కు తాము వ్యతిరేకం కాదుగానీ, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నాయి. జనగణన తర్వాతనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం జనగణనకు ముందే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని భావిస్తున్నది.
ఆ మేరకు కేంద్రం ఇవాళ లోక్‌సభలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టగా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. బిల్లును నిరసిస్తూ డీఎంకే, టీఎంసీ, సీపీఎం తదితర పార్టీలు నిరసన వ్యక్తంచేశాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో బిల్లుపై ప్రధాని ఏం మాట్లాడుతారో అనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.