ఛాతర్పూర్: కేన్-బెట్వా (Ken-Betwa River Linking) నదీ అనుసంధానం జాతీయ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి నూరవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ ప్రణాళికలో భాగంగా దేశంలో తొలిసారి నదీ అనుసంధానం ప్రాజెక్టు కార్యం రూపం దాల్చింది. మధ్యప్రదేశ్‌లోని ఛాతర్‌పూర్‌లో దౌదెన్ డ్యామ్‌ను నిర్మిస్తున్నారు.
కేన్ నదిలో ప్రవహించే అదనపు నీటిని.. ఉత్తరప్రదేశ్‌లోని బెట్వా నదికి తరలిస్తారు. 2021లోనే ఈ ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం దక్కింది. కేబీఎల్పీ ప్రాజెక్టు కోసం సుమారు 44,605 కోట్లు ఖర్చు చేయనున్నారు. రాజకీయ, పర్యావరణ కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యం అయ్యింది.
నదీ అనుసంధానం ద్వారా యూపీలోని బేట్వా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న బుందేల్‌ఖండ్‌లో పంటల సాగును పెంచనున్నారు. సుమారు 77 మీటర్ల ఎత్తు, రెండు కిలోమీటర్ల వెడల్పుతో కేన్-బెట్వా ప్రాజెక్టు కోసం డ్యామ్‌ను నిర్మిస్తున్నారు.
పన్నా టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ఈ ప్రాజెక్టును కడుతున్నారు. దౌధాన్ డ్యామ్‌తో పాటు సుమారు 230 కిలోమీటర్ల కెనాల్ కూడా నిర్మించనున్నారు.
#WATCH | Chhatarpur, Madhya Pradesh: On the occasion of 100th birth anniversary of former Prime Minister Atal Bihari Vajpayee, Prime Minister Narendra Modi will inaugurate and lay the foundation stone of Ken- Betwa river linking national project, country’s first interlinking of… pic.twitter.com/PDzQQLEloP
— ANI (@ANI) December 24, 2024