ఒప్పందాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ.. శాంతి పునరుద్ధరణపై ఆశాభావం
పశ్చిమాసియాలో ఘర్షణలను ముగించేందుకు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ప్రధాని మోదీ తన ‘ఎక్స్' పోస్టులో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక అంతరాయానికి కారణమై, పలు దేశాలలో ప్రాణ నష్టానికి దారితీసిన పశ్చిమాసియా ఘర్షణలను ముగించేందుకు అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాను.
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఘర్షణలను ముగించేందుకు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ పోస్టులో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక అంతరాయానికి కారణమై, పలు దేశాలలో ప్రాణ నష్టానికి దారితీసిన పశ్చిమాసియా ఘర్షణలను ముగించేందుకు అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాను. ఈ అవగాహన అమలు అయితే ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాల పునరుద్ధరించడం, నౌకాయాన, స్వేచ్ఛా వాణిజ్యానికి భరోసా కల్పిస్తుందని భారతదేశం ఆశిస్తున్నదని పేర్కొన్నారు.
శాంతియుత పరిష్కారం దిశగా కీలక ముందడుగు
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందంపై ప్రపంచమంతా హర్షం వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు, నాయకులు స్వాగతించారు. పశ్చిమాసియాలో శాంతి, శాశ్వత ప్రశాంతత దిశగా ఒక ముందడుగు పడిందని పాకిస్థాన్, ఖతార్ ఒప్పందాన్ని ప్రశంసించాయి. చర్చలు ప్రారంభించడాన్ని, మిలిటరీ ఆపరేషన్స్ ఆపేయడాన్ని సౌదీ అరేబియా స్వాగతించింది.
ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్టు కువైట్ తెలిపింది. పాకిస్థాన్ చేపట్టిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలను చైనా ప్రశంసించింది. శాంతియుత పరిష్కారం దిశగా ఒక కీలకమైన అడుగు పడిందని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రెటరీ గుటెరస్ అన్నారు. ప్రాంతీయ స్థిరత్వానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది అత్యవసరమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా అభిప్రాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

