న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: తనను అవినీతిపరుడిగా నిరూపించేందుకు ప్రధాని మోదీ కుట్ర పన్నారని ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన జనతా కీ ఆందోళన్‌లో ఆయన మాట్లాడుతూ ‘నన్ను, మనీశ్ సిసోడియాను అవినీతిపరులుగా చూపేందుకు ప్రధాని కుట్ర పన్నారు. పదేండ్లు సీఎంగా ఉన్నా తనకు ఢిల్లీలో సొంత ఇల్లు లేదన్నారు. తాను నిజాయతీపరుడిని కాదని భావిస్తే ఎన్నికల్లో ఓటేయద్దని ప్రజలను కోరారు.
ప్రధాని మోదీ చర్యలపై సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ఆర్ఎస్ఎస్కు అయిదు ప్రశ్నలు సంధించారు. ‘కొడుకు తన తల్లి పట్ల తన వైఖరి చూపించే పెద్ద వాడయ్యడా?’ అని అర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్‌ను ప్రశ్నించారు. కేంద్ర ఏజెన్సీ ల దుర్వినియోగం, అవినీతి నేతల ను పార్టీలో చేర్చుకోవడం, ఆర్ఎస్ఎస్ అవసరం లేదన్న బీజేపీ వైఖరిపై, బీజేపీలో వయోపరిమితి నిబంధనపై ఆర్ఎస్ఎస్ సమా ధానం చెప్పాలన్నారు.