వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఇవాళ వారణాసిలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం ఆయన కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. అభిషేకం, అర్చన చేశారు. వారణాసిలో మెగా రోడ్‌షో నిర్వహించనున్నారు. ఆ తర్వాత గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ఆయన ప్రారంభిస్తారు. విశ్వనాథుడి ఆలయంలో వేద మంత్రోచ్చరణల నడుమ ఆయన పూజలో పాల్గొన్నారు. శివుడికి అభిషేకం చేశారు. హారతి ఇచ్చారు. మాతా అన్నపూర్ణదేవి, గంగా మాతలను కూడా ఆయన దర్శించుకున్నారు. ఆ పిక్స్‌ను మోదీ తన ఎక్స్ అకౌంట్లో రిలీజ్ చేశారు.
హర్ హర్ మహాదేవ్ అని ట్యాగ్ చేశారు. కాశీలోని బాబా విశ్వనాథ్ మందిరంలో దర్శనం, పూజ చేయడం సౌభాగ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు.దేశంలోని ప్రతి పౌరుడు సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని బోలేనాథుడిని వేడుకున్నట్లు తెలిపారు. మాతా అన్నపూర్ణేశ్వరి, గంగా మాతల దర్శనం తనకు గాఢమైన శాంతిని ఇస్తుందన్నారు. ఆమె చల్లని చూపు ప్రతి ఒక్కరిలో పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాశీ ప్రజలకు మరోసారి వందనాలు అంటూ మోదీ తన పోస్టులో రాశారు.
हर हर महादेव !
काशी में बाबा विश्वनाथ मंदिर में दर्शन और पूजन का सौभाग्य मिला। यहां भगवान भोलेनाथ से समस्त देशवासियों के लिए सुख-समृद्धि और आरोग्यपूर्ण जीवन की कामना की।
माँ अन्नपूर्णा एवं माँ गंगा के दर्शन से असीम शांति मिली। उनकी कृपा से हर किसी में सकारात्मक ऊर्जा का संचार… pic.twitter.com/68GTnogoZW
— Narendra Modi (@narendramodi) April 29, 2026