న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ ఆదివారం అఖిల పక్ష సమావేశం జరగనున్నది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నారు. అన్ని పార్టీలకు చెందిన ప్రతినిధులను ఆ భేటీకి ఆహ్వానిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై మోదీ విపక్షాలతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే సోమవారం నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు సంబంధించిన ముసాయిదా తీర్మారాన్ని సంయుక్త పార్లమెంటరీ సంఘం ఆమోదించింది. అయితే ఈ బిల్లును వచ్చే సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.