ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎనిమిది కొత్త రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. గుజరాత్‌లోని సర్ధార్ వల్లాభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం ఉన్న కెవాడియాను దేశవ్యాప్తంగా పలు స్టేషన్లకు అనుసంధానిస్తున్నారు. అలాగే దభోయ్, చందోద్, కెవాడియా మధ్య కొత్త బ్రాడ్‌గేజ్ లైన్‌తోపాటు స్టేషన్ల కొత్త భవనాలను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులు సమీపంలోని గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యకలాపాలకు తోడ్పడుతాయని పీఎంఓ ఒక ప్రకటనలో పేర్కొంది. కొత్తగా ప్రారంభించే రైళ్లు నర్మదా నది ఒడ్డున ఉన్న పురాతన, పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచుతాయని చెప్పింది. తద్వారా పర్యాటకుల సంఖ్య పెరిగి కొత్త ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగై ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పీఎంఓ పేర్కొంది.
ఎనిమిది రైళ్లు కెవాడియాకు వారణాసి, హజ్రత్ నిజాముద్దీన్, రేవా, చెన్నై, ప్రతాప్‌నగర్, దాదర్, అహ్మదాబాద్ నుంచి నడువనున్నాయి. 2018 డిసెంబర్లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నర్మదానది ఒడ్డున ఉన్న 182 ఎత్తయిన సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కెవాడియాను సందర్శించి.. రైల్వే స్టేషన్‌కు పునాదిరాయి వేశారు. ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు సందర్శించేందుకు వీలుగా రైల్వే కనెక్టివిటీని పెంచారు. కెవాడియా ప్రధాన మార్గంతో అనుసంధానించేందుకు 18 కిలోమీటర్ల దభోయ్-చందోద్ ఇరుకైన గేజ్ మార్గాన్ని బ్రాడ్‌గేజ్‌గా మార్చారు. 32 కిలోమీటర్ల బ్రాడ్‌గేజ్ లైన్ వేసి చందోద్ను కెవాడియాతోను అనుసంధానించారు. అలాగే సోమవారం గుజరాత్లో రెండు మెట్రోలైన్లకు ప్రధాని పునాది రాయి వేయనున్నారు.
తాజావార్తలు
- పేదల కోసం ఎంజీఆర్ ఎంతో చేశారు : ప్రధాని మోదీ
- గర్భిణి చితిలో బంగారం కోసం సెర్చ్.. నలుగురు నిందితులు అరెస్ట్
- కోచింగ్ సెంటర్ విద్యార్థులకు కొవిడ్ టెస్టులు తప్పనిసరి
- మరో హాస్పిటల్‌కు టైగర్ వుడ్స్ తరలింపు
- ఆస్కార్ రేసులో ఆకాశం నీ హద్దురా.. ఆనందంలో చిత్ర బృందం
- లవర్‌తో గొడవ.. ఆటోలో నుంచి దూకిన యువతి
- కోదాడలో ప్రేమజంట ఆత్మహత్య
- బెజ్జూర్‌లో పెద్దపులి కలకలం
- అక్షర్‌తో పాండ్యా ఇంటర్వ్యూ.. కోహ్లీ ఏం చేశాడో చూడండి
- సీపీఐ సీనియర్ నేత పాండియన్ కన్నుమూత