న్యూఢిల్లీ: వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తామని ప్రధాని మోదీ అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాష్ర్టాలతో కలిసి పనిచేస్తామని ప్రధాని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్, బీహార్లలో ఎన్డీయే కూటమి విజయానికి కారణమైన టీడీపీ అధినేత చంద్రబాబు, బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌లకు అభినందనలు తెలియజేశారు. మూడో దఫా అధికారం చేపట్టాక, అవినీతిని రూపుమాపటంపై ఎక్కువగా దృష్టి సారిస్తాం’ అని అన్నారు. బీజేపీ మెజార్టీ మార్క్‌ను అందుకోలేకపోయినా, వివిధ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిందని చెప్పుకున్నారు.