సోమవారం 25 మే 2020
National - Mar 30, 2020 , 13:31:08

యోగా 3డీ యానిమేటెడ్‌ వీడియోలను షేర్‌ చేసిన మోదీ

యోగా 3డీ యానిమేటెడ్‌ వీడియోలను షేర్‌ చేసిన మోదీ

న్యూఢిల్లీ:  కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తాన్ని లాక్‌డౌన్‌ చేసింది.  గత మంగళవారం అర్ధరాత్రి నుంచి  21 రోజుల పాటు దేశమంతా లాక్‌ డౌన్‌ అమలు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు.  ఆ రోజు నుంచి అత్యవసర సేవలు మినహా అన్ని సర్వీసులను బంద్‌ చేయడంతో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం  సందర్భంగా    గతంలో  తాను యోగా చేస్తున్న దృశ్యాల తాలూకు యానిమేటెడ్ వీడియోలను ప్రధాని మోదీ షేర్‌ చేశారు.  'ఆదివారం నిర్వహించిన మన్‌కీబాత్‌ కార్యక్రమం సందర్భంగా  ప్రస్తుత సమయంలో  నా ఫిట్‌నెస్‌ దినచర్య గురించి ఒకరు నన్ను అడిగారు.  అందుకే యోగా వీడియోలను షేర్‌ చేయాలనే ఆలోచన వచ్చింది. మీరందరూ కూడా యోగాను రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌ చేస్తారని అనుకుంటున్నానని' మోదీ ట్వీట్‌ చేశారు. తాను యోగా చేస్తున్న దృశ్యాల తాలూకు యానిమేటెడ్ వీడియోలను ఆయన విడుదల చేశారు. 

  


logo