Loksabha Elections 2024 : మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించబోమని కాంగ్రెస్ ప్రకటించగలదా అని ప్రధాని నరేంద్ర మోదీ సవాల్ విసిరారు. రాజ్యాంగంతో చెలగాటమాడబోమని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ప్రకటించమని కాంగ్రెస్ పార్టీ గానీ, ఆ పార్టీ యువరాజు కానీ ప్రకటించే సాహసం చేస్తారా అని తాను సవాల్ చేస్తున్నానని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రకటించే ధైర్యం చేయదని అన్నారు. ప్రధాని మోదీ బుధవారం గుజరాత్‌లోని బనస్కంతలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.
బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్లను కాపాడతామని ఆయన స్పష్టం చేశారు. గుజరాతీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ విద్వేషం విరజిమ్ముతోందని, మోదీ, ఓబీసీలను కాంగ్రెస్ అవమానిస్తోందని దుయ్యబట్టారు. రిజర్వేషన్లను రద్దు చేస్తారని కాంగ్రెస్, విపక్ష ఇండియా కూటమి అసత్యాలతో ప్రజల ముందుకొచ్చాయని విమర్శించారు.
400 సీట్ల గురించి మాట్లాడుతున్నవారు తమకు పార్లమెంట్లో ఇప్పటికే 360 స్ధానాలు ఉన్నాయన్న విషయం మరువరాదని అన్నారు. బీజేడీ, వైసీపీ వంటి పార్టీలు తమ కూటమిలో లేకున్నా తమకు మద్దతిచ్చాయని గుర్తుచేశారు. వీటన్నింటిని కలుపుకుంటే తమకు పార్లమెంట్లో 400 స్ధానాల బలమున్నా తాము రిజర్వేషన్లను తొలగించే పాపానికి పాల్పడలేదని గుర్తుచేశారు. 2014కు ముందు కాంగ్రెస్ హ యాంలో ఉగ్రదాడులు, స్కామ్‌లు, అవినీతి గురించి దేశవ్యాప్తంగా కథనాలు వచ్చేవని అన్నారు.
Read More :
Pawan Kalyan | వైసీపీకి పొలిటికల్ హాలిడే ప్రకటించాలి : పవన్‌కల్యాణ్