PM Modi | న్యూఢిల్లీ : ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ దెబ్బతీసింది అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఉగ్రవాద శిబిరాలపై భారత మిస్సైళ్లు, డ్రోన్లు కచ్చితమైన లక్ష్యంతో దాడులు నిర్వహించాయి. బహవల్పూర్, మురిద్కే లాంటి తీవ్రవాద స్థావరాలపై దాడి చేసి భీతావహ పరిస్థితి భారత్ సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సానుభూతి పరులకు ఏం చేస్తుందో భారత్ చెప్పింది అని మోదీ పేర్కొన్నారు.
రెండున్నర దశాబ్దాలుగా పాక్లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఉగ్రవాద తండాలను ఒక్క దెబ్బతో తుడిచిపెట్టింది. భారత్కు వ్యతిరేకంగా పాక్ నుంచి కుట్రలు పన్నుతున్న ఉగ్రవాద తండాలను తుదముట్టించింది. 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత్. భారత్ దెబ్బకు పాకిస్తాన్ నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయింది. భారత్ దెబ్బకు పాక్ అచేతనావస్థకు చేరుకుంది. దాడులతో ఎటూ పాలుపోని పాకిస్తాన్ భారత్లోని జనావాసాలు, పాఠశాలలపై దాడికి దిగింది అని మోదీ గుర్తు చేశారు.
పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైళ్లను భారత్ క్షిపణి రక్షణ వ్యవస్థ సరిహద్దులు దాటకుండానే కూల్చేసింది. భారత మిస్సైళ్లు పాక్ రక్షణ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసేశాయి. పాక్ గర్వంగా చెప్పుకునే మిస్సైళ్లు, రక్షణ వ్యవస్థలను భారత్ నిర్వీర్యం చేసింది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, రాడార్ స్టేషన్లలో భారత్ మిస్సైళ్లు విధ్వంసం సృష్టించాయి. పాక్ యుద్ధ విమానాలు గాలిలోకి ఎగరలేని స్థితిని భారత్ కల్పించింది అని మోదీ పేర్కొన్నారు.
#WATCH | During his address to the nation, Prime Minister Narendra Modi says, “…’Aatankiyo ne hamari behano ka Sindoor ujada tha isliye Bharat ne aatank ke headquarters ujaad diye’. Over 100 terrorists were killed…” pic.twitter.com/jkXjUJ7cbP
— ANI (@ANI) May 12, 2025