PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి అరుదైన గౌరవం లభించింది. మోదీకి బార్బడోస్ (Barbados) దేశం ప్రతిష్ఠాత్మకమైన ‘ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్’ (Honorary Order of Freedom of Barbados) పురస్కారాన్ని ప్రదానం చేసింది. కొవిడ్ మహమ్మారి సమయంలో మోదీ సమర్థ నాయకత్వం, విలువైన సహాయాన్ని గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేసింది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ తరఫున విదేశాంగ సహాయ మంత్రి పబిత్రా మార్గెటిటా ఈ అవార్డును అందుకున్నారు.
ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డును గతేడాది నవంబర్ 20న గయానాలోని జార్జ్‌టౌన్‌లో జరిగిన 2వ ఇండియా-CARICOM లీడర్స్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో బార్బడోస్ ప్రధాని మియా అమోర్ మోట్లీ ప్రకటించినట్లు పేర్కొంది.
Also Read..
Infosys | ఉద్యోగులు నెలలో 10 రోజులు ఆఫీస్‌కు రావాల్సిందే.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం
Dependents | భారతీయుల పిల్లలకు బహిష్కరణ ముప్పు.. ట్రంప్ విధానాలతో భవిష్యత్తు అగమ్యగోచరం!
Pune | బొట్టు, తాళి ధరించకపోతే ఎలా.. నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపుతాడు?