PM Modi | స్టార్ కపుల్స్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana Konidela) దంపతులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రశంసించారు. భారతదేశంలో ప్రాచీన క్రీడ అయిన ఆర్చరీకి తిరిగి ప్రాచుర్యం కల్పించేందుకు వారు చేస్తున్న సేవలను అభినందించారు. వారితోపాటూ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (Archery Premier League) చైర్మన్ అనిల్ కామినేని (Anil Kamineni) కృషిని కూడా ప్రధాని ప్రశంసించారు. ఈ మేరకు మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టు పెట్టారు.
Glad to have met you, Upasana and Anil Kamineni Garu. Your collective efforts to popularise archery are commendable and will benefit countless youngsters.@AlwaysRamCharan@upasanakonidela https://t.co/Al8aYCv0dY
— Narendra Modi (@narendramodi) October 12, 2025
రామ్ చరణ్, ఉపాసన దంపతులు అనిల్ కామినేని సారథ్యంలో వరల్డ్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వీరు ప్రధాని మోదీని కలిశారు. ప్రధానితో సమావేశమైన చరణ్, ఉపాసన, అనిల్ కామినేనిలు లీగ్‌కు సంబంధించిన వివరాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి జ్ఞాపికతో పాటు, ప్రత్యేకంగా తయారు చేయించిన విల్లును మోదీకి అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.
Also Read..
Karur stampede | కరూర్ తొక్కిసలాట ఘటన.. సీబీఐ దర్యాప్తునకు సుప్రీం ఆదేశం
Suresh Gopi | మంత్రిగా డబ్బులు రావట్లేదు.. సినిమాలే చేసుకుంటా : కేంద్రమంత్రి సురేశ్ గోపీ
Israeli Hostages | రెండేండ్ల తర్వాత ఇజ్రాయెల్ బందీలకు విముక్తి.. ఏడుగురిని విడుదల చేసిన హమాస్