భువనేశ్వర్, జూన్ 20: వాషింగ్టన్ని సందర్శించాలని కోరుతూ అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందచేసిన ఆహ్వానాన్ని తాను తిరస్కరించిననట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వెల్లడించారు. దానికి బదులుగా జగన్నాథ స్వామి కొలువై ఉన్న పవిత్ర భూమి ఒడిశాకు రావాలని తాను నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు. ఒడిశాలో బీజేపీ తొలి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు.
ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భారీయెత్తున నిర్వహించే యోగా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు విస్తరించి ఉన్న 26 కి.మీ పొడవైన కారిడార్లో మూడు లక్షల మంది ఒకేసారి యోగా చేసేందుకు ఏర్పాట్లు చేశారు.