న్యూఢిల్లీ: ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో భేటీ అయ్యారు. కిర్గిస్తాన్‌లో జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) సమావేశంలో ఆ ఇద్దరు కలుసుకున్నారు. కిర్గిస్తాన్ రాజధాని బిష్కేక్లో ఆ మీటింగ్ జరిగింది. ఫిబ్రవరిలో ప్రారంభమైన ఇరాన్ వార్ తర్వాత తొలిసారి ఈ ఇద్దరు నేతలు కలుసుకున్నారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు అటాక్ చేసిన విషయం తెలిసిందే. ఇదే సమావేశాల్లో ఆర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యాన్‌తోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. పెజెష్కియాన్, మోదీ మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ హోర్ముజ్ జలసంధి అంశంలో చర్చ జరిగి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. పెజెష్కియాన్, మోదీ మధ్య జరిగిన భేటీ గురించి భారత్‌లో ఇరాన్ ఎంబసీ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే అమెరికాకు వ్యతిరేకంగా శక్తులను ఏకీకరించేందుకు పెజెష్కియాన్ ఎస్సీవో మీటింగ్‌లో పాల్గొంటున్నారు.
Dr. Masoud Pezeshkian, President of the Islamic Republic of Iran, met and held talks with Shri Narendra Modi, Prime Minister of India, during the first leg of his visit to Kyrgyzstan to attend and address the Shanghai Cooperation Organisation (SCO) Summit and the Shanghai Plus… pic.twitter.com/I46TvGG7dP
— Iran in India (@Iran_in_India) August 31, 2026