శనివారం 04 జూలై 2020
National - Jun 30, 2020 , 14:42:50

కోవిడ్‌19 వ్యాక్సిన్ త‌యారీపై ప్ర‌ధాని మోదీ స‌మీక్ష‌

కోవిడ్‌19 వ్యాక్సిన్ త‌యారీపై ప్ర‌ధాని మోదీ స‌మీక్ష‌

హైద‌రాబాద్‌:  కోవిడ్‌19 నిర్మూల‌న కోసం దేశానికి చెందిన కొన్ని ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ త‌యారీలో నిమ‌గ్నం అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ ఇవాళ ఉన్న‌త స్థాయి సమావేశం నిర్వ‌హించారు.  కోవిడ్ నియంత్ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తుంద‌న్న అంశాల‌ను ఆయ‌న అధికారుల‌తో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.  వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ త‌యారీ కోసం స‌మ‌ర్థ‌వంతమైన సాంకేతిక అంశాల‌ను విశ్లేషించుకోవాల‌ని సూచించారు.  టీకా త‌యారీ కోసం భారీ స్థాయిలో వివ‌ర‌ణాత్మ‌క ప్ర‌ణాళిక‌ల‌ను త‌యారు చేయాల‌ని ఆయ‌న అధికారుల‌కు ఆదేశించారు. 

కోవిడ్‌19 చికిత్స కోసం దేశంలో జ‌రుగుతున్న వ్యాక్సిన్ ప‌రీక్ష‌లు, ప్ర‌పంచ దేశాలు కూడా చేప‌డుతున్న ట్ర‌య‌ల్స్ గురించి ప్ర‌ధాని మోదీ అధికారుల‌తో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.  ప్రపంచ‌దేశాల‌కు టీకా త‌యారు చేసి ఇవ్వాల్సిన బాధ్య‌త గురించి కూడా మోదీ ప్ర‌స్తావించారు.  భార‌త్ బాధ్య‌త‌తో, క‌ట్టుబ‌డి వ్యాక్సిన్ త‌యారీలో నిమ‌గ్నం కావాల‌న్నారు. 

logo