మాల్దా: దేశంలోని మొట్టమొదటి వందేభారత్ స్లీపర్(Vande Bharat Sleeper) రైలును ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. హౌరా నుంచి గౌహతి వరకు ఆ రైలు వెళ్తుంది. బెంగాల్‌లోని మాల్దా రైల్వే స్టేషన్ నుంచి ఆయన ఆ రైలును స్టార్ట్ చేశారు. ఇక గౌహతి నుంచి హౌరా వచ్చే వందేభారత్ స్లీపర్ రైలును ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. రైలులో చిన్నారులు, స్కూల్ స్టూడెంట్స్‌తో మోదీ ఇంటెరాక్ట్ అయ్యారు. ఏసీ వందేభారత్ స్లీపర్ రైలుతో .. తక్కువ ధరకే విమాన ప్రయాణం లాంటి ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. సుదీర్ఘ దూరాలను చాలా వేగంగా, సురక్షితంగా చేరుకునేలా చేస్తుందని, దీని ద్వారా పర్యాటకం పెరుగుతుందని ఆ ప్రకటనలో తెలిపారు.
వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన తర్వాత మోదీ ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వందేభారత్ రైలు.. మేడిన్ ఇండియా అని, భారతీయులు తమ చమటోడ్చి ఈ రైలును నిర్మించినట్లు చెప్పారు. పవిత్రమైన బెంగాల్ నేల నుంచి భారతీయ రైల్వేల ఆధునీకరణకు మరో కీలక అడుగు పడిందని, దేశంలో ఇవాళ వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభిస్తున్నామన్నారు. చాలా సౌకర్యవంతంగా, విలాసవంతంగా, మరుపురాని రీతిలో ప్రయాణం సాగేట్టు వందేభారత్ రైళ్లను నిర్మించినట్లు చెప్పారు. వికసిత్ భారత్‌లో ఎలాంటి రైళ్లు ఉండాలో వందేభారత్‌ను చూస్తే తెలుస్తుందన్నారు.
#WATCH | Malda, West Bengal | Prime Minister Narendra Modi flags off India’s first Vande Bharat Sleeper Train between Howrah and Guwahati (Kamakhya) at Malda Town Railway Station.
(Source: DD) pic.twitter.com/ohvSAoqXSX
— ANI (@ANI) January 17, 2026