Jagdeep Dhankhar: జగదీప్ ధన్కర్కు ఫోన్ చేసి బాధను వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
Jadgeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగదీప్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. నిన్న పార్లమెంట్లో జరిగిన ఘటన పట్ల ఆయన బాధను వ్యక్తం చేశారు. మాక్ పార్లమెంట్ ద్వారా జగదీప్‌ను అవమానించడం దురదృష్టకరమని ప్రధాని అన్నారు. 20 ఏళ్లుగా తనుకు ఇలాంటి అవమానాలే ఎదురవుతున్నాయన్నారు.
న్యూఢిల్లీ: మాక్ పార్లమెంట్ నిర్వహించి రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్(Jagdeep Dhankhar)పై మిమిక్రీ చేసిన విపక్ష సభ్యుల ప్రవర్తనను ప్రధాని మోదీ ఖండించారు. మాక్ పార్లమెంట్ ఘటన దురదృష్టకరమని ప్రధాని అన్నారు. ఆ ఘటన పట్ల బాధను వ్యక్తం చేసిన ప్రధాని.. రాజ్యసభ చైర్మెన్ జగదీప్‌కు ఫోన్ చేసి తన విచారాన్ని తెలిపారు. మంగళవారం సస్పెండ్ అయిన పార్లమెంట్ విపక్ష సభ్యులు.. మకర ద్వారం వద్ద ఉన్న మెట్లపై కూర్చుని చైర్మెన్ జగదీప్‌ను వెక్కిరిస్తూ నాటకం వేసిన విషయం తెలిసిందే. టీఎంసీ నేత కళ్యాణ్ బెనర్జీ.. చైర్మెన్ జగదీప్ తరహాలో నటిస్తూ ఆయన్ను అవమానించారు.
ఈ నేపథ్యంలో జగదీప్‌కు మోదీ ఫోన్ చేశారు. 20 ఏళ్లుగా ఇలాంటి అవమానాలు ఎదుర్కొన్నానని, ఇంకా అలాంటి అవమానాలు ఎదురవుతున్నాయని, రాజ్యాంగబద్దమైన స్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి లాంటి వ్యక్తులకు, అది కూడా పార్లమెంట్లో అవమానం జరగడం దురదృష్టకరమని ప్రధాని మోదీ అన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ఫోన్లో వెల్లడించినట్లు ధన్కర్ తన సోషల్ మీడియా అకౌంట్లో వెల్లడించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా తాను మాత్రం కట్టుబడి పని చేస్తానని, తన మార్గాన్ని ఎవరూ మార్చబోరు అని ప్రధానికి ఫోన్లో చెప్పిటన్లు చైర్మెన్ ధన్కర్ తెలిపారు.
Received a telephone call from the Prime Minister, Shri @narendramodi Ji. He expressed great pain over the abject theatrics of some Honourable MPs and that too in the sacred Parliament complex yesterday. He told me that he has been at the receiving end of such insults for twenty…
— Vice President of India (@VPIndia) December 20, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
Mrunal Thakur | కథలు నచ్చక..కాస్త విరామం..! మృణాల్ ఠాకూర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

