PM Modi : తమిళనాడు (Tamil Nadu) నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (Joseph Vijay) కి ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల జీవన ప్రమాణాలను మరింతగా మెరుగుపర్చడం కోసం తాము రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం తాము అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మోదీ పాలన అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా విజయ్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళనాడు ప్రజాతీర్పు సమాజంలో పెరుగుతున్న యువ గళాన్ని ప్రతిబంబిస్తోందని పేర్కొన్నారు. దానిని తాను ఎప్పటికీ విస్మరించబోమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ప్రజల కోసం కృషి చేస్తూనే ఉంటుందని హామీ ఇచ్చారు. తమిళనాడులో ఆరు దశాబ్దాల డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల పాలనకు విజయ్ ముగింపు పలికారని అన్నారు.
కాగా ఆదివారం ఉదయం విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్.. విజయ్‌తో ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు కొత్త మంత్రివర్గం కోసం తొమ్మిది మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో ఏడుగురు టీవీకే ఎమ్మెల్యేలు, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.