అహ్మదాబాద్: ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. మరికాసేపట్లో గాంధీనగర్లో ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి. అంతిమయాత్రలో భాగంగా ప్రధాని మోదీ తన మాతృమూర్తి పాడె మోశారు. అంతిమయాత్ర వాహనంలో అమ్మ పక్కనే కూర్చున్నారు. గాంధీనగర్లోని సెక్టార్ 30 శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. సన్నిహితులకు మాత్రమే అంతిమక్రియల్లో పాల్గొనేందుకు అనుమతించనున్నారు. ఈనేపథ్యంలో అంత్యక్రియలు జరిగుతున్న ఘటనాస్థలికి రావద్దని, కుటుంబసభ్యులకు స్థలం ఇవ్వాలని బీజేపీ కార్యకర్తలను ప్రధాని కోరారు.
తల్లి మృతితో ప్రధాని మోదీ భావోధ్వేగపూరిత ట్వీట్ చేశారు.. ‘నిండు నూరేండ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుని పాదాల చెంత విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిది. ఆమెలో తాను ఎప్పుడూ త్రిమూర్తులను చూశాను. ఆమె ఒక నిస్వార్ధ కర్మయోగి. విలువలకు నిలువెత్తు నిదర్శనం’ అని చెప్పారు.
Gujarat: Prime Minister Narendra Modi pays respect to his mother Heeraben Modi at Gandhinagar residence.
(Source: DD) pic.twitter.com/VJimh3FXZC
— ANI (@ANI) December 30, 2022
Gandhinagar, Gujarat | Mortal remains of Heeraben Modi, mother of PM Modi being taken for the last rites. pic.twitter.com/h39kmQi0Po
— ANI (@ANI) December 30, 2022