న్యూఢిల్లీ, జూలై 2: కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలా ప్రవర్తించవద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు. మంగళవారం ఎన్డీయే ఎంపీలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఒక కాంగ్రేసేతర నేత, అదీ ఒక చాయ్‌వాలా వరుసగా మూడోసారి ప్రధానమంత్రి కావడంతో ప్రతిపక్షం కలత చెందిందని మోదీ పేర్కొన్నారు. ఏదైనా అంశంపై మీడియాతో మాట్లాడే ముందు దానిపై పూర్తిగా అధ్యయనం చేయాలని ఆయన ఎంపీలకు సూచించారు.
హ్యాలో ఆర్బిట్‌ను చుట్టొచ్చిన ఆదిత్య ఎల్1
బెంగళూరు, జూలై 2: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గత ఏడాది ప్రయోగించిన ‘ఆదిత్య ఎల్1’.. లాగ్రాంజ్-1 పాయింట్ చుట్టూ ఉన్న ‘హ్యాలో ఆర్బిట్’ను ఒక రౌండ్ చుట్టొచ్చింది. మంగళవారం ఇస్రో ఈమేరకు వెల్లడించింది. రెండో రౌండ్ ప్రయాణం మొదలైందని తెలిపింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు గత ఏడాది సెప్టెంబర్ 2న శ్రీహరి కోట నుంచి ఆదిత్య ఎల్1ను ఇస్రో ప్రయోగించింది. భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్-1 వద్ద హ్యాలో ఆర్బిట్‌లోకి వ్యోమనౌకను విజయవంతంగా చేర్చింది.