PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ మలేసియాలో పర్యటిస్తున్నారు. రెండు రోజులపాటు ఆయన మలేసియాలో ఉంటారు. ఈ మేరకు ప్రత్యేక విమానంలో శనివారం సాయంత్రం మోదీ మలేసియా చేరుకున్నారు. ఆయనకు ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఘన స్వాగతం పలికారు. రాజధాని కౌలాలంపూర్‌లో చిన్నారులు రెండు దేశాల జాతీయ పతాకాలు చేతపట్టుకోగా.. మలేసియా ప్రధానితోపాటు ఇరు దేశాల ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
అనంతరం ఒకే కారులో మోదీ, అన్వర్ హోటల్‌కు చేరుకున్నారు. ప్రధాని హోదాలో మోదీ అక్కడ పర్యటించడం ఇది మూడోసారి. ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలోపేతం కావడంతోపాటు, కీలక అంశాల్లో సహకారం దిశగా ఒప్పందాలు జరగనున్నాయి. రక్షణ, భద్రత, ఆర్థిక పరమైన అంశాలపై మోదీ, అన్వర్ చర్చిస్తారు. మలేసియా ప్రధాని ఆహ్వానం మేరకు ఈ పర్యటన చేపడుతున్నట్లు మోదీ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు వేగంగా బలోపేతం అవుతున్నాయని, ఈ పర్యటన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత వృద్ధి చేస్తుందని భావిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. అలాగే మోదీ.. మలేసియాలోని భారతీయులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అక్కడ దాదాపు మూడు మిలియన్లకుపైగా భారత జాతీయులు నివసిస్తున్నారు.
Telah tiba di Kuala Lumpur.
Saya amat menghargai sambutan mesra yang diberikan oleh sahabat saya, Perdana Menteri Anwar Ibrahim, di lapangan terbang. Saya menantikan pertemuan dan perbincangan yang bermakna serta usaha berterusan untuk memperkukuh hubungan persahabatan antara… pic.twitter.com/4FOYNJJXXv
— Narendra Modi (@narendramodi) February 7, 2026
అక్కడ ఉంటున్న భారతీయులు రెండు దేశాల మధ్య స్నేహానికి, చారిత్రక నేపథ్యానికి వారధిగా మారారని అభివర్ణించారు. ఇండియా నుంచి మలేసియాకు చమురు, అల్యూమినియం, మాంసం, ఇనుము, స్టీల్, కాపర్, కొన్ని రకాల ఆర్గానిక్ కెమికల్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వంటివి ఎగుమతి అవుతున్నాయి. ఇక మలేసియా నుంచి పామాయిల్, కొన్ని రకాల ఆయిల్స్, పరిశ్రమల మెషినరీ వంటివి ఇండియా దిగుమతి చేసుకుంటోంది. మోదీ పర్యటనలో భాగంగా ఇరు దేశాలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేస్తాయి.