న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన అంతిమ సంస్కారాలను ప్రభుత్వ అధికార లాంఛనాతో శనివారం నిర్వహించనున్నారు. ఏడు రోజులపాటు సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక సంస్కర్తకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.
అరుదైన రాజకీయ నాయకుడు: రాష్ట్రపతి ముర్ము
‘విద్య, పరిపాలనను సులభంగా నడిపించిన అరుదైన రాజకీయ నేతల్లో మాజీ ప్రధాని మన్మోహన్ ఒకరు. భారత ఆర్థిక వ్యవస్థ సంస్కరణలో ఆయన సేవలు కీలకమైనవి. దేశానికి ఆయన చేసిన సేవలు, నిష్కళంకమైన రాజకీయ జీవితం, ఆయన వినయం చిరస్మరణీయం. ఆయన మరణం మనందరికీ తీరని లోటు. భరతమాత ముద్దుబిడ్డల్లో ఒకరైన మన్మోహన్కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నా.’
Former Prime Minister Dr Manmohan Singh Ji was one of those rare politicians who also straddled the worlds of academia and administration with equal ease. In his various roles in public offices, he made critical contributions to reforming Indian economy. He will always be…
— President of India (@rashtrapatibhvn) December 26, 2024
ఆర్థిక సరళీకరణ రూప శిల్పి: ఉప రాష్ట్రపతి ధన్ఖడ్
మన్మోహన్ సింగ్ ఇక లేరన్న విషయం చాలా బాధకు గురిచేసింది. ఆయన దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చారు. ఆర్థిక సరళీకరణ రూప శిల్పిగా పేరు గడించారు. ఎంతో ధైర్యం ప్రదర్శించి కఠిన నిర్ణయాలతో దేశం ముందుకు సాగేలా చేశారు. దేశ అభివృద్ధికి ఎన్నో ద్వారాలు తెరిచారు. ఆర్థిక విధానం పట్ల ఆయనకున్న ప్రగాఢ విశ్వాసం, దేశ పురోగతి పట్ల అచంచల నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దేశం మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
Deeply pained to learn about the passing of Dr. Manmohan Singh Ji, former Prime Minister and a distinguished economist who transformed India’s economic landscape. A Padma Vibhushan awardee and architect of India’s economic liberalisation in 1991, he boldly steered our nation… pic.twitter.com/28A6pKYjvK
— Vice-President of India (@VPIndia) December 26, 2024
ఆర్థిక వ్యవస్థపై బలమైన ముద్ర: ప్రధాని మోదీ
విశిష్టమైన నాయకుల్లో ఒకరిని కోల్పోవడంతో భారత్ దుఃఖంలో మునిగిపోయింది. వినమ్రమైన మూలాల నుంచి ఆయన గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారు. ప్రధానిగా, ఆర్థిక మంత్రి సహా అనేక ప్రభుత్వ హోదాల్లో పనిచేసి దేశ ఆర్థిక వ్యవస్థపై ఆయన బలమైన ముద్ర వేశారు. పార్లమెంట్లో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవి. ప్రధానిగా దేశ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ఎంతో కృషి చేశారు. మన్మోహన్ ప్రధానిగా, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరుచూ మాట్లాడుకునేవాళ్లం. పాలనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేవాళ్లం. ఆయన జ్ఞానం, వినయం ఎల్లప్పుడూ ప్రస్ఫుటించేవి. ఈ సమయంలో నా ఆలోచనలన్నీ ఆయన కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి.
India mourns the loss of one of its most distinguished leaders, Dr. Manmohan Singh Ji. Rising from humble origins, he rose to become a respected economist. He served in various government positions as well, including as Finance Minister, leaving a strong imprint on our economic… pic.twitter.com/clW00Yv6oP
— Narendra Modi (@narendramodi) December 26, 2024
గురువు, మార్గదర్శిని కోల్పోయా: రాహుల్ గాంధీ
గురువు, మార్గదర్శిని కోల్పోయాను. మన్మోహన్ సింగ్జీ తన అద్భుతమైన మేథ, సమగ్ర దృక్పథంతో దేశాన్ని నడిపించారు. ఆర్థిక అంశాలపై ఆయన అవగాహన దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
Manmohan Singh Ji led India with immense wisdom and integrity. His humility and deep understanding of economics inspired the nation.
My heartfelt condolences to Mrs. Kaur and the family.
I have lost a mentor and guide. Millions of us who admired him will remember him with the… pic.twitter.com/bYT5o1ZN2R
— Rahul Gandhi (@RahulGandhi) December 26, 2024
గవర్నర్ నుంచి ఆర్థిక మంత్రిగా.. ప్రధానిగా: అమిత్ షా
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరన్న వార్త చాలా బాధ కలిగించింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నుంచి ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశ పాలనలో కీలక పాత్ర పోషించారు ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని భగవంతుణ్ని వేడుకుంటున్నా.
पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह जी के निधन की सूचना अत्यंत दुःखद है। भारतीय रिजर्व बैंक में गवर्नर से लेकर देश के वित्त मंत्री और प्रधानमंत्री के रूप में डॉ. मनमोहन सिंह जी ने देश की शासन व्यवस्था में महत्त्वपूर्ण भूमिका निभाई। दुःख की इस घड़ी में उनके परिजनों व समर्थकों के…
— Amit Shah (@AmitShah) December 26, 2024
మన్మోహన్ సింగ్ మృతి చాలా బాధాకరమని రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ అన్నారు. ఆయన మృతి కాంగ్రెస్ కుటుంబానికి తీరని లోటుని చెప్పారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు. దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిని దేశం కోల్పోయిందన్నారు. మన్మోహన్ ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయని చెప్పారు. మన్మోహన్ను దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో గుర్తుపెట్టుకుంటుందని తెలిపారు.
Undoubtedly, history shall judge you kindly, Dr. Manmohan Singh ji!
With the passing of the Former Prime Minister, India has lost a visionary statesman, a leader of unimpeachable integrity, and an economist of unparalleled stature. His policy of Economic Liberalisation and… pic.twitter.com/BvMZh3MFXS
— Mallikarjun Kharge (@kharge) December 26, 2024
రాజకీయాల్లో కొంత మంది నేతలు మంది మాత్రమే స్ఫూర్తిగా నిలుస్తారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ అన్నారు. వారిలో ఒకరు మన్మోహన్ సింగ్ అని చెప్పారు. ఆయన నిజాయతీ మాకు ఎప్పుడూ ఒక స్ఫూర్తిగా ఉంటుందన్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శలు చేసినా నిబద్ధతతో దేశానికి సేవ చేశారని తెలిపారు. ఆయన ఎంతో తెలివైన, ధైర్యసాహసాలు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. కఠినమైన రాజకీయ ప్రపంచంలో ప్రత్యేక గౌరవప్రదమైన, సున్నిత వ్యక్తిగా చివరి వరకు కొనసాగారని వెల్లడించారు.
Few people in politics inspire the kind of respect that Sardar Manmohan Singh ji did.
His honesty will always be an inspiration for us and he will forever stand tall among those who truly love this country as someone who remained steadfast in his commitment to serve the nation… pic.twitter.com/BXA6zHG2Fq
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 26, 2024
ఆర్థికవేత్తగా, రిజర్వు బ్యాంక్ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు దిశానిర్దేశం చేసిన మన్మోహన్ సింగ్ చిరస్మరణీయులని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎంతో ఆత్మీయులని చెప్పారు. వారి నిబద్ధత, క్రమశిక్షణ, నిరాడంబరత ఆదర్శమైనవని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
భారతదేశ పూర్వ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ పరమపదించారని తెలిసి విచారించాను.
ఆర్థికవేత్తగా, రిజర్వు బ్యాంక్ గవర్నర్ గా, ఆర్థిక మంత్రిగా దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా వారు చిరస్మరణీయులు. వ్యక్తిగతంగా నాకు ఎంతో ఆత్మీయులైన వారి నిబద్ధత, క్రమశిక్షణ,… pic.twitter.com/HjjoVa8vOc— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) December 26, 2024
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి తీవ్ర వేదన కలిగించిందని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. 1991లో ఆర్థికమంత్రిగా సంస్కరణలు ప్రారంభించినప్పటి నుంచి ప్రధానమంత్రి దాకా దేశానికి ఆయన నిరుపమాన సేవలు అందించారని కొనియాడారు.