న్యూఢిల్లీ: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది. జనవరి 22న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనుంది. బుధవారం ఢిల్లీలో ప్రధానిని కలిసిన ట్రస్ట్ సభ్యులు.. మందిర ప్రారంభానికి రావాలని ఆహ్వానించారు.