న్యూఢిల్లీ : పీఎం-కిసాన్ పథకం 21 విడత సాయం కింద రూ.18 వేల కోట్లను కేంద్రం బుధవారం విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికిపైగా సన్న, చిన్నకారు రైతులు లబ్ధి పొందారని తెలిపింది.
కోయంబత్తూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేశారు. ఈ పథకం కింద కేంద్రం రైతులకు ఏటా రూ.6 వేలను మూడు విడతలుగా అందజేస్తున్నది.