Plasticosis | న్యూఢిల్లీ: ప్లాస్టిక్ కాలుష్యం వలన ‘ప్లాస్టికోసిన్’ అనే వ్యాధి వస్తుందని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో పేర్కొన్నారు. ఈ వ్యాధిని మొదటిసారి పక్షుల్లో గుర్తించినట్టు వెల్లడించారు. ప్లాస్టికోసిస్ అనేది చిన్న, సూక్ష్మ ప్లాస్టిక్ పదార్థాల కారణంగా సంభవిస్తుందని, ఇది జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ప్లాస్టికోసిస్ వ్యాధిని ప్రస్తుతానికి పక్షుల్లో గుర్తించినప్పటికీ, ఈ ప్లాస్టిక్ కాలుష్య దుష్పరిణామాలు మానవ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని అధ్యయనం హెచ్చరించింది.