న్యూఢిల్లీ, డిసెంబర్ 13: బెంగళూరులో 34 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుత వరకట్న, గృహహింస చట్టాల దుర్వినియోగాన్ని ఆపేందుకు ఆ చట్టాలను సమీక్షించి, సంస్కరించడానికి ఒక నిపుణుల కమిటీని నియమించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ కోవిదులతో కమిటీ ఏర్పాటును న్యాయవాది విశాల్ తివారీ తన పిల్లో కోరారు.
ఐపీసీలోని 498ఏ సెక్షన్ దుర్వినియోగాన్ని విమర్శిస్తూ గతంలో సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలను అమలు చేయాలని అభ్యర్థించారు.