బెంగళూర్ : మెట్రో నగరాల్లో సమయానికి గమ్యస్ధానం చేరాలంటే గగనమే..ట్రాఫిక్ జామ్‌లకు నెలవైన బెంగళూర్ వంటి నగరాల్లో సమయ పాలన కష్టమే. ఉద్యోగులు ఉరుకులు పరుగులు పెట్టినా సకాలంలో కార్యాలయాలకు చేరుకోవడం ఇబ్బందికరం. బెంగళూర్‌లో టెకీల ట్రాఫిక్ కష్టాలు అంతాఇంతా కాదు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ఓ మహిళ బైక్ వెనక కూర్చుని ల్యాప్‌టాప్‌తో ఆఫీసు పనులను చక్కదిద్దుతున్న ఫోటో (viral Pic) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ట్విట్టర్ యూజర్ నిహర్ లోహియ కారు నుంచి తీసిన ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆఫీసుకు ర్యాపిడో బైక్‌పై వెళుతూ ట్రాఫిక్‌లోనే ల్యాప్‌టాప్‌పై వర్క్ చేస్తోందని పోస్ట్‌కు క్యాప్సన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌ను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 40,000 మందికి పైగా వీక్షించారు. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు కంపెనీలు పని విధానంలో వెసులుబాటు ఇవ్వాలని, ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పించాలని కోరారు. బెంగళూర్ ట్రాఫిక్ కష్టాలపైనా పలువురు యూజర్లు ఏకరువు పెట్టారు. ప్రజలు సకాలంలో ఇండ్ల నుంచి బయటపడినా గమ్యస్ధానాలు చేరేందుకు గంటల సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read More
viral video | గజరాజుల ఘర్షణతో నిలువెల్లా వణికిన అడవి !