Watch: కారులోని వ్యక్తి చైన్ స్నాచింగ్‌కు యత్నం.. ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న మహిళ
Viral Video | కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి చేయి బయటకుపెట్టి కౌసల్య మెడలోని బంగారు గొలుసును తెంపుకుని పోయేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె తన చేతులతో గట్టిగా ఆ చైన్‌ను పట్టుకుంది. దీంతో ఆ వ్యక్తి గొలుసును వదిలివేయడంతో ఆమె కారు పక్కగా రోడ్డుపై పడింది.
చెన్నై: సాధారణంగా బైక్‌పై ఉన్న వ్యక్తులు మహిళల మెడలోని బంగారు గొలుసులను చోరీ చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే దీనికి భిన్నంగా కారులో వెళ్తున్న వ్యక్తి చైన్ స్నాచింగ్ (Snatching)కు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఒక మహిళ ఆ కారు కింద పడబోయి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ్యింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ సంఘటన జరిగింది. పీలమేడు ప్రాంతంలోని హడ్కో కాలనీకి చెందిన 33 ఏళ్ల ఆర్ కౌసల్య ప్రతి రోజూ తన భర్తతో కలిసి మార్నింగ్ వాక్ చేసేది. అయితే సోమవారం ఉదయం ఆమె ఒంటరిగా వాకింగ్‌కు వెళ్లింది.
కాగా, ఒక కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి చేయి బయటకుపెట్టి కౌసల్య మెడలోని బంగారు గొలుసును తెంపుకుని పోయేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె తన చేతులతో గట్టిగా ఆ చైన్‌ను పట్టుకుంది. దీంతో ఆ వ్యక్తి గొలుసును వదిలివేయడంతో ఆమె కారు పక్కగా రోడ్డుపై పడింది. ఆ కారు వెనక చక్రం కింద పడే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. అలాగే తన గొలుసు చోరీ కాకుండా ఆమె కాపాడుకుంది.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలోని అన్ని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. నంబర్ ప్లేట్ లేని ఆ కారును గుర్తించి నిందితులను అరెస్ట్ చేశారు. ఆ మహిళ ఫిర్యాదుతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Coimbatore, Tamil Nadu | In a chain snatching incident, caught on CCTV camera, a 33-year-old woman Kaushalya was seen falling down and briefly being dragged by the accused in a car. The woman managed to save the chain from being snatched. Based on the complaint and CCTV… pic.twitter.com/5PcagaUhvI
— ANI (@ANI) May 16, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

