అహ్మదాబాద్, మార్చి 25: గుజరాత్ పోలీసులు జైళ్లలో రాత్రికి రాత్రి నిర్వహించిన భారీ ఆపరేషన్లో ఫోన్లు, ప్రాణాంతక వస్తువులు, మాదక ద్రవ్యాలు దొరికాయి. 1,700 మంది పోలీసులు 17 జైళ్లలో నిర్వహించిన సోదాల్లో ఇవి బయటపడ్డాయి.
పోలీసులు 16 మొబైల్ ఫోన్లు, 10 ఎలక్ట్రానిక్ వస్తువులు, 39 ప్రాణాంతక వస్తువులు, 3 మాదక ద్రవ్యాలు, 512 పొగాకు ఉత్పత్తులు జైళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు.