న్యూఢిల్లీ : మొబైల్ పోగొట్టుకున్నారా? ఎక్కడుందో ట్రాక్ చేయాలా? డాటా ఇతరులు చూడకుండా బ్లాక్ చేయాలా? దీనికి సంబంధించి ట్రాకింగ్ విధానాన్ని దేశంలో ఈ వారంలో ప్రవేశపెట్టనున్నట్టు ఒక ఉన్నత అధికారి తెలిపారు. టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమెటిక్స్ ఆధ్వర్యంలో సీఐఈఆర్ (సీర్) విధానాన్ని ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈశాన్య ప్రాంతాల్లోని టెలికం సర్కిళ్లలో పైలట్ ప్రాజెక్టుగా పరిశీలించారు. ఇది విజయవంతం కావడంతో దీనిని ఈ నెల 17న దేశమంతటా ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.