భువనేశ్వర్: బీజేపీ పాలిత ఒడిశాలో నిరుద్యోగం ఎంత ఎక్కువగా ఉందో తెలిపే ఉదంతం ఇది. ఈ నెల 28న ఝారసుగుడాలో 102 హోంగార్డ్ పోస్టుల భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహించగా 2,700 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
తక్కువ వేతనం వచ్చే ఈ తాత్కాలిక ప్రభుత్వ చిరుద్యోగాలకు అయిదో తరగతి ఉత్తీర్ణత అర్హత అయినప్పటికీ డిగ్రీ, పీజీ చదివిన వారూ పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. వేరే ఉపాధి అవకాశాలు లేక జీవనం కోసం చివరి అవకాశంగా భావించి ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేశామని పలువురు తెలిపారు.