Good News | త్వరలో దాబాల్లో పెట్రోల్ పంపులు!
Petrol pumps can open at Dhabas | త్వరలో జాతీయ రహదారుల వెంట ఉన్న దాబాల్లో పెట్రోల్ పంపులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు పంపుల

న్యూఢిల్లీ : త్వరలో జాతీయ రహదారుల వెంట ఉన్న దాబాల్లో పెట్రోల్ పంపులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు పంపుల నిర్మాణానికి దాబా యజమానులకు అనుమతులు జారీ చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి దాబాల్లో పెట్రోల్ పంపులు ఏర్పాటు చేయడం ద్వారా అటు యజమానులకు, ఇటు వాహనదారులకు ప్రయోజనాలుంటాయనే అంశంపై మాట్లాడారు.
జాతీయ రహదారుల వెంట పెట్రోల్ బంకులకు ఎన్ఓసీ ఇచ్చినట్లే.. చిన్న దాబా యజమానులకు పెట్రోల్ పంపులు, టెయిలెట్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. దేశంలోని హైవేలపై ఇంధన స్టేషన్ల నెట్వర్క్ను అనుసంధానించడంతో దాబా యజమానులకు అదనపు ఆదాయ వనరుగా మారుతుందన్నారు. అయితే ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్స్టేషన్ల ఏర్పాటుపై గడ్కరీ స్పందించలేదు. అయితే, ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు భవిష్యత్ సౌకర్యాలకు పునాది వేయగలదని భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

