న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు కంపెనీలు రోజుకు పెట్రోల్ (Petrol), డీజిల్‌పై (diesel) దాదాపు ఒక రూపాయి చొప్పున పెంచుతున్నాయి. మార్చి 22న ప్రారంభమైన ఈ వడ్డింపు కొనసాగుతూనే ఉన్నది. తాజాగా లీటర్ పెట్రోల్‌పై మరో 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు వడ్డించాయి. దీంతో హైదరాబాద్‌లో మంగళవారం లీటరు పెట్రోలు రూ.118.59, డీజిల్ రూ.104.62గా ఉన్న ధరలు రూ.119.49కి, డీజిల్ రూ.105.49కి చేరాయి.
ఇక న్యూఢిల్లీలో లీటరుకు 80 పైసల చొప్పన పెరగడంతో పెట్రోల్ రూ.105.41, డీజిల్ రూ.96.67కు పెరిగాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌పై 84 పైసలు పెరగడంతో రూ.120.51కి, డీజిల్‌పై 85 పైసలు వడ్డించడంతో రూ.104.77కు చేరాయి. చమురు ధరలు పెరగడం గత 16 రోజుల్లో ఇది 14వ సారి.