చెన్నై : తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అధికారిక నివాసం రాజ్‌భవన్ మెయిన్ గేట్ ముందు పెట్రోల్ బాంబులు విసిరిన వ్యక్తిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్‌భవన్‌లోని మెయిన్ గేట్ వైపు కరుక వినోద్ అనే వ్యక్తి మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో రెండు పెట్రోల్ బాంబులను విసిరాడు. 2022లో చెన్నైలోని బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబులు విసిరినందుకు గతంలో అరెస్టయిన వినోద్ మూడు రోజుల కిందటే విడుదలయ్యాడు.
సైదాపేట్ కోర్టు ప్రాంగణంలో పార్క్ చేసిన వాహనాల నుంచి పెట్రోల్‌ను చోరీ చేసిన వినోద్ నేరుగా రాజ్‌భవన్‌కు నడుచుకుంటూ వచ్చి రెండు బాటిల్స్‌లో పెట్రోల్ నింపి వాటికి నిప్పు పెట్టి రాజ్‌భవన్ ప్రధాన ద్వారంపైకి విసిరేశాడు. మెయిన్ గేట్ వద్ద వినోద్‌ను పోలీసులు అడ్డగించారు. ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై స్పందించారు.
రాజ్‌భవన్‌పై పెట్రోల్ బాంబులు విసిరిన ఘటన రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతల పరిస్ధితికి అద్దం పడుతోందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం డీఎంకే చౌకబారు ఎత్తుగడలకు పాల్పడుతుంటే నేరగాళ్లు వీధుల్లో చెలరేగుతున్నారని పేర్కొన్నారు.
Read More :
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు లేవు : ఈఎన్సీ మురళీధర్