పెట్రోల్ కోసం డిష్యుం డిష్యుం.. మహారాష్ట్రలో కొట్టుకున్న వాహనదారులు
దేశంలో పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని సాక్షాత్తు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి, అధికారులు రోజూ ప్రకటిస్తున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి.
ముంబై, మే 17: దేశంలో పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని సాక్షాత్తు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి, అధికారులు రోజూ ప్రకటిస్తున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. ప్రతి రోజూ దేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో పెట్రోల్ కొరతకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా, మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో తీవ్రంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. అకోలా నాక ప్రాంతంలో వందలాది మంది వాహనదారులు శనివారం ఒక పెట్రోల్ బంక్ వద్ద గుమిగూడి తోపులాటకు దిగి ఒకరినొకరు కొట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాషిమ్‌లోని ఒక పెట్రోల్ బంక్‌లోకి పెట్రోల్ దిగుమతి చేయడానికి వచ్చిన ఒక ఆయిల్ ట్యాంకర్‌ను సుమారు 400 మంది వాహనదారులు అడ్డుకున్నారు.
ముందు తమకు పెట్రోల్ పోయాలంటూ వారు డిమాండ్ చేశారు. అయితే బంక్‌లోని ఆటోమేటిక్ వ్యవస్థ ప్రకారం అన్లోడింగ్ సమయంలో పెట్రోల్ అమ్మకాలు సాగించడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని బంక్ నిర్వాహకులు పదేపదే విజ్ఞప్తి చేయడంతో వాహనదారులు వెనక్కి తగ్గి, ట్యాంకర్ అన్‌లోడింగ్‌కు అనుమతి ఇచ్చారు. తర్వాత వినియోగదారుల మధ్య తోపులాట ప్రారంభమై, అది ఘర్షణగా మారింది.
కొంతమంది అయితే పెద్దపెద్ద కర్రలు తీసుకువచ్చి అక్కడ ఉన్న వారిపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు, బంక్ సిబ్బంది జోక్యం చేసుకుని ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, తమకు పోలీస్ రక్షణ కల్పిస్తేనే తాము డీజిల్, పెట్రోల్ అమ్మకాలు సాగించగలమని, అధికార యంత్రాంగం ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పలువురు బంక్ యజమానులు కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

