Ajmer Dargah | న్యూఢిల్లీ: రాజస్థాన్లోని అజ్మీరులో ఉన్న సూఫీ సెయింట్ మొయినుద్దీన్ ఛిస్తీ దర్గా కింద శివాలయం ఉందని అజ్మీరు కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ శివాలయంలో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ, తమ పిటిషన్పై కోర్టు స్పందించిందని చెప్పారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), అజ్మీరు దర్గా కమిటీ, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.
పుణే: అత్యంత కఠోరంగా ఉండే యుద్ధ క్షేత్రాలు సియాచిన్ మంచు కొండలు, కార్గిల్, గల్వాన్ లోయలను ప్రత్యక్షంగా చూడటానికి పర్యాటకులకు అనుమతి ఇవ్వాలని భారత సైన్యం నిర్ణయించింది. సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది బుధవారం జనరల్ బీసీ జోషీ స్మారకోపన్యాసంలో మాట్లాడుతూ, ఇటువంటి విధానం వల్ల జమ్ముకశ్మీరు ఉగ్రవాదం నుంచి పర్యాటకానికి మారిందని చెప్పారు.