తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలోని ప్రభుత్వం స్కూల్లో ఓ విద్యార్థి క్లాస్‌రూమ్‌లో పెప్పర్ స్ర్పే(Pepper Spray) కొట్టాడు. ఈ ఘటనలో 9 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారు. శ్వాసకోస ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులను నీమమ్ తాలూక ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం మెడికల్ కాలేజీ కాజువాల్టీ వార్డులో స్టూడెంట్స్‌కు చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. తీవ్రమైన శ్వాస ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు.
పున్నమూడు ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్ రాణి మాట్లాడుతూ.. స్కూల్లో ఇంటర్వెల్ తర్వాత క్లాస్‌రూమ్‌లో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. ఓ టీచర్ క్లాస్‌రూమ్‌కు వెళ్లగా.. అక్కడ విద్యార్థులు తీవ్ర ఇబ్బందిపడుతున్నట్లు గుర్తించారు. ఆ వెంటనే కొందర్ని క్లాస్రూమ్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఇద్దరు టీచర్లకు కూడా బ్రీతింగ్ సమస్య వచ్చింది. పెప్పర్ స్ప్రే వాడినట్లు తేల్చారు.
అయితే క్లాస్‌రూమ్‌కు ఎందుకు పెప్పర్‌స్ప్రేను తీసుకువచ్చారో తెలియదు. ఈ కోణంలో స్కూల్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులకు సరైన వైద్యం అందించాలని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆదేశించారు.