న్యూఢిల్లీ: తలసేమియా, హిమోఫిలియా, సికిల్ సెల్ వంటి రోగాలున్నవారు అంగవైకల్యం గల వ్యక్తుల క్యాటగిరీ కింద ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లకు అర్హులు కాదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది.
దివ్యాంగుల హక్కుల చట్టం, 2016లోని సెక్షన్ 34 ప్రకారం, ప్రభుత్వ వ్యవస్థల్లో రిజర్వేషన్లను పొందడానికి తలసేమియా వంటి బ్లడ్ డిజార్డర్స్ ఉన్నవారు అర్హులు కాదని కేంద్ర సాంఘిక న్యాయ శాఖ సహాయ మంత్రి ప్రతిమ భౌమిక్ తెలిపారు. ఈ వ్యాధులను చట్ట ప్రకారం అంగవైకల్యం జాబితాలో చేర్చినందువల్ల ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తిస్తాయని ఉద్యమకారులు భావించారు.